హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు: SP

MDK: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా సెప్టెంబర్‌ 1 నుంచి 30 వరకు పోలీస్‌ యాక్ట్‌–1861లోని 30, 30(ఎ) సెక్షన్లు అమల్లో ఉంటాయని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. ధర్నాలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలకు పోలీసుల ముందస్తు అనుమతి తప్పనిసరి అన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.