హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ సమరభేరి..!

MLG: మంగపేట మండలంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం సోమవారం నిర్వహించారు. కుడుముల లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు నిర్వహించే నిరసనలను విజయవంతం చేసి, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.