ASF: కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ వైస్ ఛైర్మన్ డాక్టర్ అనిత, BRS కౌన్సిలర్లు సోమవారం నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ.. పట్టణంలో వీధిలైట్లు ఏర్పాటు, దోమలు, కుక్కల బెడద సమస్య తీవ్రంగా ఉందన్నారు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
తెలంగాణ
VIDEO: పట్టణ సమస్యలపై కౌన్సిలర్ల పోరుబాట


