అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. అనంతపురం నగరంలోని సప్తగిరి సర్కిల్ వద్ద వినాయక చవితి ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మండప నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సప్తగిరి సర్కిల్‌లో గత 44 ఏళ్లుగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'మట్టి వినాయక ప్రతిమలను ప్రతిష్టించాలి'


