హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు ఉదయం 6 గంటల నుంచి పింఛన్ల పంపిణీ

TPT: ఎర్రావారిపాలెం మండలంలో మంగళవారం ఉదయం 6 గంటల నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేపట్టనున్నట్లు ఎంపీడీవో దివాకర్ తెలిపారు. మండలవ్యాప్తంగా 4,599 మంది లబ్ధిదారులకు రూ.1,94,58,500 పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు ఉదయం 6 గంటలకే తమ గ్రామాలకు చేరుకుని పింఛన్ తీసుకోవాలని ఆయన సూచించారు.