హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సబ్ కలెక్టర్ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్

KRNL: ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహించారు. ఆర్డీవో అరుణదేవి ఆధ్వర్యంలో మండల స్థాయి అధికారులు పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. భూ సమస్యలు, రెవెన్యూ అంశాలకు సంబంధించి అధిక సంఖ్యలో ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రతి అర్జీని పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.