హైదరాబాద్: 28°C
తెలంగాణ

కలెక్టరేట్‌ వద్ద సీపీఎం ఆందోళన

ఖమ్మం కలెక్టరేట్‌ ధర్నా చౌక్‌ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. విద్య, వైద్య రంగాల్లో సమస్యలను పరిష్కరించాలని జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలని, ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం, మందులు అందించాలన్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.