హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రైతులు పంట వివరాలు నమోదు చేసుకోవాలి'

SRPT: నడిగూడెం మండలం సిరిపురంలో వరిసాగు చేస్తున్న రైతులు పంట వివరాలను పోర్టల్ లో నమోదు చేసుకోవాలని ఏఈఓ రేణుక సూచించారు. ప్రభుత్వం సూచించిన ఏడు సన్న రకాల విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు ఆధార్, పట్టాదార్ పాస్ బుక్, విత్తనాల బిల్లుతో అదే డీలర్ వద్ద, అలాగే ఇతర రైతుల వద్ద నుంచి విత్తనాలు పొందిన వారు రైతు ధృవీకరణ పత్రంతో ఏఈఓ ను సంప్రదించాలన్నారు.