SRPT: సూర్యాపేట డివిజన్ డీఎస్పీ కార్యాలయాన్ని ఎస్పీ నరసింహ సోమవారం వార్షిక తనిఖీ చేశారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించిన ఆయన ఎట్రాసిటీ, పోక్సో కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సకాలంలో ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలని ఆదేశించారు. ప్రజా భద్రత పోలీసుల ప్రథమ కర్తవ్యమని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఎస్పీ


