హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కులగణన శాస్త్రీయంగా జరగాలి'

HNK: జిల్లాలో కులగణనను శాస్త్రీయంగా, పారదర్శకంగా నిర్వహించాలని బీసీ ఉద్యమ నాయకుడు డాక్టర్ పరికిపండ్ల అశోక్ డిమాండ్ చేశారు. హన్మకొండలో ఆయన మాట్లాడుతూ.. ప్రశ్న నెం.10లో ఓబీసీ కేటగిరీని స్పష్టంగా చేర్చాలని కోరారు. ప్రతి కులానికి ప్రత్యేక యూనిక్ కోడ్ కేటాయించి డ్రాప్‌డౌన్ విధానం అమలు చేయాలని సూచించారు. లోపాలు జరిగితే బీసీలకు దశాబ్దాల పాటు అన్యాయం జరుగుతుందని హెచ్చరించారు.