హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసమే భూ సమగ్ర సర్వే

MNCL: బెల్లంపల్లి మండలంలోని చాకపల్లి గ్రామపంచాయతీ సమగ్ర భూ సర్వేపై సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వినోద్, సబ్ కలెక్టర్ మనోజ్ పాల్గొన్నారు. అన్ని భూములను రీ-సర్వే చేయడానికి చేపడుతున్న ప్రక్రియపై రైతులకు అవగాహన కల్పించారు. రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా భూ రీ సర్వే చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.