హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాలిటెక్నిక్ విద్యార్థులతో విద్యార్థి సేన ధర్నా

RR: షాద్‌నగర్ ముఖ్య కూడలిలో విద్యార్థి సేన ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్థులు జీవో నంబర్ 97ను రద్దు చేయాలని ధర్నా నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని విద్యార్థి సేన అధ్యక్షుడు శివ ప్రసాద్ డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.