హైదరాబాద్: 28°C
తెలంగాణ

"రోడ్డు మరమ్మతులు చేపట్టాలని వినూత్న నిరసన"

BHPL: రేగొండ మండలం నారాయణపురం గ్రామంలో ప్రధాన రహదారి బురదమయంగా మారడంతో గ్రామస్తులు వినూత్నంగా నిరసన తెలిపారు. రోడ్డు మరమ్మతులు చేయాలని పలుమార్లు అధికారులను, ప్రజాప్రతినిధులను కోరిన స్పందన లేకపోవడంతో బురదలో వరి నాట్లు వేశారు. వర్షాలతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని, విద్యార్థులు, వృద్ధులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.