హైదరాబాద్: 28°C
తెలంగాణ

నగరంలో పదో తరగతి విద్యార్థి సూసైడ్

HYD: మియాపూర్ సుభాష్ చంద్రబోస్ నగర్‌లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. చదువు సరిగా రావడం లేదనే మనస్తాపంతో మల్లికార్జున(16) అనే పదో తరగతి విద్యార్థి ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి పెయింటర్‌గా జీవనం సాగిస్తున్నాడు. మియాపూర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.