హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజా సమస్యలపై సత్వర చర్యలు తీసుకోవాలి'

BPT: బాపట్ల కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డా. వినోద్ కుమార్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు భరోసా కల్పించారు. అధికారులు నిర్లక్ష్యం లేకుండా సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఒకే సమస్యపై పదేపదే అర్జీలు రాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు.