విజయనగరం: ఎల్. కోట, మల్లీవీడు గ్రామంలో కొలువైన గ్రామదేవత శ్రీ నూకాంబికా అమ్మవారి ఆలయ నూతన సింహద్వారాన్ని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రారంభించారు. మల్లీవీడు గ్రామానికి చెందిన రైల్వే రిటైర్డ్ జూనియర్ ఇంజనీర్ తాళబత్తుల సుదర్శనరావు, లక్ష్మి దంపతులు సొంతూరుపై మమకారంతో రూ.6 లక్షలు వెచ్చించిన ఆలయ సింహద్వారాన్ని నిర్మింపజేశారు.
ఆంధ్రప్రదేశ్
నూకాంబిక అమ్మవారి ఆలయ సింహద్వారం ప్రారంభం


