హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వినాయక చవితి ఉత్సవాలకి పోలీస్ అనుమతి తప్పనిసరి'

ELR: వినాయక చవితి ఉత్సవాలను ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, భక్తిశ్రద్ధలతో ఆనందోత్సవాల మధ్య నిర్వహించుకోవాలని ఎస్పీ ప్రతాప్ కిషోర్ అన్నారు. జిల్లావ్యాప్తంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని ఉల్లంఘిస్తే 6 నెలల జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు. ఉత్సవ కమిటీలకు పలు ముఖ్య సూచనలు చేసారు.