హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదం.. అనకాపల్లి జిల్లా మహిళ మృతి

విశాఖ: శ్రీనగర్ డీమార్ట్ నుంచి స్కూటీపై వెళుతున్న వ్యక్తులను ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో ఒక మహిళ మృతి చెందింది. సోమవారం ఉదయం అనకాపల్లి (D) రావికమతానికి చెందిన ముగ్గురు స్కూటీపై తన చుట్టాలు ఇంటికి వెళ్లడానికి గాజువాక మీదుగా వెళ్తుండగా చినగంట్యాడ లైఫ్ స్టైల్ షోరూం దగ్గర ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బంగారం (60) అక్కడికక్కడే మృతి చెందింది.