హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొరిటెపాడు వాకింగ్ ట్రాక్ నిధుల ఖర్చుపై రగడ!

GNTR: కొరిటెపాడు వాకింగ్ ట్రాక్ నిధుల వినియోగంలో భారీ అక్రమాలు జరిగాయని సభ్యులు ఆరోపించారు. సర్వసభ్య సమావేశంలో పాలకవర్గ అనుమతి లేకుండా లక్షలాది రూపాయలు ఖర్చు చేయడంపై నిలదీశారు. రూ.6 లక్షల జిమ్ పరికరాలకు రూ.12 లక్షలు చూపిస్తారా అని మండిపడ్డారు. ఇసుక ట్రాక్, సంక్రాంతి వేడుకల ఖర్చులు కూడా అవాస్తవాలని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.