E.G: అనపర్తి నుంచి మార్టేరు వ్యవసాయ పరిశోధన సంస్థకు వెళ్లే రైతుల విజ్ఞాన యాత్రను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సోమవారం ప్రారంభించారు. అనపర్తి నియోజకవర్గం నుంచి 110 మంది రైతులు యాత్రలో పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయం, నూతన వరి వంగడాలు, ఆధునిక సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వ్యవసాయ విజ్ఞాన యాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే


