TPT: చిన్నగొట్టిగల్లు మండలం తుమ్మ చేనుపల్లె గ్రామంలో రాత్రి ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గ్రామానికి చెందిన రైతు భాను ప్రకాశ్ రెడ్డి సాగు చేసిన టమాటా పంటలోకి ప్రవేశించిన ఏనుగులు పంటను తొక్కి ధ్వంసం చేశాయి. దీంతో సుమారు రూ.50 వేల వరకు నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఏనుగుల సంచారంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
పంటను ధ్వంసం చేసిన ఏనుగులు


