హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీసీ రోడ్డు లేక.. ఇబ్బందుల్లో స్థానికులు

NLG: నగరంలోని 9వ డివిజన్ అయ్యప్ప ఆలయానికి వెళ్లే ప్రధార రహదారిలో సీసీ రోడ్డు లేక స్థానికులు, వాహనదాలరు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతంలో ఇటీవల యూజీడీ చేపట్టిన పనులు సైతం పూర్తిస్థాయిలో జరగకపోవడంతో ప్రస్తుతం ఉన్న తాత్కాలిక మార్గంలో రాకపోకలు సాగించేందుకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు స్పందించి సీసీ రోడ్లు నిర్మించాలని కోరుతున్నారు.