BDK: భద్రాచలం మండలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో సోమవారం భక్తుల సౌకర్యార్థం కియాస్క్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎస్‌బీఐ భద్రాచలం సౌజన్యంతో నూతన సమాచార కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన కియాస్క్ ద్వారా ఆర్జిత సేవలు, ప్రసాదం టికెట్లు పొందవచ్చు. భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆలయ అధికారులు కోరారు.
తెలంగాణ
భద్రాచలం ఆలయంలో కియాస్క్ ద్వారా టికెట్లు


