హైదరాబాద్: 28°C
తెలంగాణ

మూసీ వంతెనపై దెబ్బతిన్న కాంక్రీట్!

SRPT: పాలకవీడు మండలం శూన్యపహాడ్ వద్ద మూసీనది వంతెనపై కాంక్రీటు దెబ్బతిని గుంతలు పడ్డాయ. దామరచర్ల, పాలకవీడు, మఠంపల్లి మండలాలను కలిపే రహదారిలో ఈ వంతెన ఉంది. ఈ మార్గంలో సిమెంట్ లారీలు వెళ్తుంటాయి. ఇదే రహదారిలో జాన్‌పహాడ్ రైల్వే వంతనపై సైతం భారీ గుంతలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరారు.