KMM: పారిశుద్ధ్య కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబరు 16 నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నట్లు ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వేము రాంబాబు తెలిపారు. సోమవారం కల్లూరు మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డికు సమ్మె నోటీసు అందజేశారు. ఏడాదిగా వేతనాలు చెల్లిస్తామని హామీలు ఇచ్చిన అమలు కాలేదని ఆరోపించారు. బకాయిలు చెల్లించకపోతే విధులను బహిష్కరిస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి: AITUC


