హైదరాబాద్: 28°C
తెలంగాణ

పింఛన్ మంజూరుకు లంచం వసూళ్లు..?

WGL: కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్లకు వెళ్లి విచారణ పేరుతో మున్సిపల్ సిబ్బంది, బిల్ కలెక్టర్లు డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పింఛన్ వస్తుందన్న ఆశతో లబ్ధిదారులు అడిగినంత ఇచ్చినట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం అర్హత పరిశీలించి జాబితా రూపొందించాల్సి ఉండగా, గడువు ముగియకముందే డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం.