హైదరాబాద్: 28°C
తెలంగాణ

శిరీష హత్యపై మంత్రి సీతక్క దిగ్భ్రాంతి

MLG: రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని ప్రైమ్ కేర్ ఆస్పత్రిలో ములకలపల్లి మండలానికి చెందిన నర్స్ శిరీష దారుణ హత్యకు గురైన ఘటనపై మంత్రి దనసరి అనసూయ సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యువతి ప్రాణాలను అత్యంత దారుణంగా బలిగొన్న ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. డీజీపీ సీవీ ఆనంద్‌కు ఫోన్ చేసి ఘటనపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.