GDWL: మల్దకల్ మండలం బిజ్వారం గ్రామానికి నాలుగు రోజులుగా ఆర్టీసీ బస్సు రాకపోవడంతో గద్వాలకు వెళ్లే పాఠశాల, కళాశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమయానికి బస్సులు లేక అధిక ఛార్జీలు చెల్లించి ఆటోల్లో ప్రమాదకరంగా ప్రయాణించాల్సి వస్తోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బస్సులు నడపాలంటున్నారు.
తెలంగాణ
బస్సు లేక.. ఆటోలపై ఆధారం


