హైదరాబాద్: 28°C
తెలంగాణ

పొలాల్లో వేలాడుతున్న విద్యుత్ తీగలు

RR: మహేశ్వరం మండలంలోని తుమ్మలూరు గ్రామ పంట పొలాల్లో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా కిందికి వేలాడుతున్నాయి. ఐదారు అడుగుల ఎత్తులో తీగలు ఉండటంతో వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కూలీలు భయాందోళనకు గురవుతున్నారు. కొన్ని విద్యుత్ స్తంభాలు సైతం ఒరిగిపోయినట్లు రైతులు తెలిపారు. వేలాడుతున్న తీగలు, ఒరిగిన స్తంభాలకు వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రమాదాలు నివారించాలని కోరారు.