హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంతలు, బురదతో అధ్వానంగా రహదారి

విజయనగరం: గజపతినగరం మండలం బంగారమ్మపేట నుంచి మెంటాడ మండలం కొంపంగి, ఇద్దనవలస గ్రామాలకు వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. వర్షాలు కురిసినప్పుడు రహదారి మొత్తం బురదమయమై వాహనాల రాకపోకలకు ప్రమాదకరంగా ఉంటుందని వాహనదారులు వాపోతున్నారు. అత్యవసర సమయాల్లో కూడా ఈ మార్గంలో ప్రయాణించేందుకు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.