NDL: శ్రీశైలం మల్లన్న సన్నిధిలో రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సోమవారం పూజలు నిర్వహించారు. శ్రీ భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి వారి దర్శనానికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామి, అమ్మవారిని దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు చేపట్టారు. దర్శనం అనంతరం స్వామి, అమ్మవారి చిత్రపటం అందించారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీశైలంలో రాష్ట్ర మంత్రి పార్థసారధి పూజలు


