KRNL: కోసిగి మఠం పాఠశాల ప్రధాన గేటు ముందున్న సీసీ కల్వర్టు డ్రైనేజీ గుంతపడి ప్రమాదకరంగా మారింది. రోజూ బడికి వచ్చే చిన్నారుల కాళ్లు అందులో ఇరుక్కుని తీవ్ర ప్రమాదాలకు గురయ్యే అవకాశముందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి గుంతకు తక్షణమే మరమ్మతులు చేపట్టి విద్యార్థుల భద్రతను కాపాడాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పాఠశాల గేటు వద్ద ప్రమాదకర కల్వర్టు!


