హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రధాన రహదారిపై గుంతలు.. వాహనదారులకు ఇబ్బందులు

ASF: సిర్పూర్ (టి)లోని ప్రధాన రహదారిపై గుంతలు ఏర్పడి వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. వర్షపు నీరు గుంతల్లో నిలవడంతో అవి కనిపించక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. రద్దీ రహదారిపై వృద్ధులు, చిన్నారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. అధికారులు వెంటనే గుంతలు పూడ్చి మరమ్మతులు చేయాలని స్థానికులు కోరారు.