హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వైసీపీ లోకి చేరికల ప్రచారం బూటకం'

కోనసీమ: ఆత్రేయపురం మండలంలో టీడీపీ నేతలు వైసీపీలో చేరుతున్నారన్న ప్రచారం అవాస్తవమని కొత్తపేటకు చెందిన జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ముత్యాల బాబ్జి సోమవారం ఆరోపించారు. దశాబ్దాల క్రితం పదవులు చేపట్టిన ఒకరిద్దరు కండువా కప్పుకోవడాన్ని పెద్ద ఎత్తున చేరికలుగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కూటమి పాలనలో ఆత్రేయపురం మండలం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు.