ASR: అరకులోయ హైవేపై లారీబే సమీపంలో ఈ నెల 26న జరిగిన ద్విచక్ర వాహన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలుడు నాగశౌర్య (10) చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. గన్నెల గ్రామానికి చెందిన నాగశౌర్య ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నంలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు.
ఆంధ్రప్రదేశ్
ప్రమాదంలో గాయపడిన బాలుడు మృతి


