హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ICDS ప్రాజెక్టులో విధులకు డుమ్మా'

NLR: ఉదయగిరి ICDS ప్రాజెక్టు పరిధిలో కొందరు అంగన్వాడీ సిబ్బంది ఎలాంటి అనుమతులు లేకుండా నెలల తరబడి విధులకు గైర్హాజరవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిబ్బంది అనధికార గైర్హాజరుపై సీడీపీవో, సూపర్‌వైజర్ మౌనం వహించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డుమ్మా కొట్టే సిబ్బందిపై ఇప్పటివరకు శాఖాపరమైన చర్యలు తీసుకోకపోవడంపై ఆంతర్యం ఏమిటో అర్థం కావట్లేదు.