హైదరాబాద్: 28°C
తెలంగాణ

నవాబుపేటలో జోరుగా ఇసుక అక్రమ రవాణా?

MBNR: నవాబుపేట మండలంలోని గురుకుంట, అమ్మాపూర్ శివార్‌లో వాగు ప్రాంతం నుంచి రాత్రివేళల్లో మట్టి తవ్వి, ఫిల్టర్ ఇసుకగా మార్చి హైదరాబాద్‌కు తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం రెండు నెలలుగా సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనుమతులపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతున్నారు.