హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సోమశిల జలాశయంలో స్వల్పంగా తగ్గిన నీటిమట్టం

NLR: అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయం నీటిమట్టం వివరాలను అధికారులు తాజాగా విడుదల చేశారు. సోమవారం ఉదయం 6 గంటల నాటికి 18.943 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. జలాశయంలో 110 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతోంది. సోమశిల జలాశయం నుంచి పెన్నా డెల్టాకు 2000 క్యూసెక్కులు, కావలి కెనాల్‌కు 500 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు.