హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

సిద్ధాసనం వల్ల కలిగే ప్రయోజనాలు

సిద్ధాసనం వల్ల శరీరానికి, మనసుకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఇది ధ్యానం చేసుకోవడానికి అనుకూలమైన ఆసనాలలో ఒకటి. నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది. ఆందోళన, భయాన్ని దూరం చేస్తుంది. వెన్నెముక నిటారుగా ఉండేలా చేస్తుంది. తుంటి, మోకాలు, చీలమండలు, గజ్జ ప్రాంతంలోని కండరాలను సాగదీసి ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది. ఉదర భాగంలోని అవయవాలను ఉత్తేజపరిచి, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.