హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బొలెరో ఢీకొని తండ్రి, కుమార్తెకు తీవ్ర గాయాలు

అన్నమయ్య: మదనపల్లె మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తవారిపల్లె పంచాయతీ దొబ్బిగానిపల్లికి చెందిన నాగరాజా, ఆయన కుమార్తె సుశీల ద్విచక్ర వాహనంపై మదనపల్లెకు వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా తట్టివారిపల్లి సమీపంలోని చెరువు కట్టపై బొలెరో ఢీకొంది. ఈ ప్రమాదంలో తండ్రి, కుమార్తె తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.