హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిగ్రీ కాలేజీలో ఇంటరాక్టివ్‌ త్రీడీపై అవగాహన

MDCL: ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్‌ సైన్స్‌ విభాగం ఆధ్వర్యంలో ఇంటరాక్టివ్‌ త్రీడీతో కెరీర్‌ అవకాశాల పై అవగాహన సదస్సు నిర్వహించారు. గేమింగ్‌, వినోదం, ఇంజినీరింగ్‌, డిజిటల్‌ ట్విన్స్‌, వాహన రంగం, ఏఆర్‌, వీఆర్‌, రిటైల్‌ తదితర రంగాల్లో అవకాశాలను వక్త వినీలి వారణాసి వివరించారు. విద్యార్థులు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు పెంచుకోవాలన్నారు.