హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాహన తనిఖీల్లో 318 కేసులు

కడప జిల్లా వ్యాప్తంగా పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 318 కేసులు నమోదు చేసి రూ.72,995 జరిమానా విధించినట్లు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించేవారు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. రాంగ్‌రూట్‌లో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.