హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మైలవరం జలాశయం నుంచి నీరు విడుదల

KDP: మైలవరం జలాశయంలో 2.020 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో 1.435 టీఎంసీలు ప్రత్యక్ష వినియోగానికి అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. గండికోట నుంచి నీటిని తరలించేందుకు ఇన్‌ఫ్రా లేదన్నారు. కాలువలు, ఆర్టీపీపీ, తాగునీరు, బొమ్మేపల్లి పథకం అవసరాల కోసం మొత్తం 249 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.