WGL: గోదావరి పుష్కరాలు–2027 నిర్వహణ కోసం హైదరాబాద్ ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక అధికారి కార్యాలయాన్ని మంత్రి కొండా సురేఖ ఆదివారం ప్రారంభించారు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరిగే పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు రూ.1,400 కోట్లతో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సదుపాయాలపై సమన్వయంతో పనులు చేపట్టాలని అధికారులను సూచించారు.
తెలంగాణ
VIDEO: పుష్కరాల ఏర్పాట్లకు మంత్రి కొండా సురేఖ శ్రీకారం


