అనకాపల్లి: రాయవరం మండలం ధర్మవరం అగ్రహారం వద్ద వరహానదిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఇక్కడి నుంచి ట్రాక్టర్లపై ఇసుకను రవాణా చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని విమర్శించారు. ఇసుక తవ్వకాలు కారణంగా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయన్నారు. నదిలో ఇసుక తవ్వకాల వల్ల ఏర్పడుతున్న గోతులు ప్రమాదకరంగా మారుతున్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
వరాహ నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు!


