NLG: నకిరేకల్ మండలం చందుపట్ల వద్ద ఆదివారం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చందుపట్ల సమీపంలోని బ్రిడ్జిపై అతివేగంగా వచ్చిన బైక్ అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో మల్ల సురేష్ అనే యువకుడు మృతి చెందినట్లు సమాచారం. మృతుడు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
తెలంగాణ
అదుపు తప్పిన బైక్.. యువకుడు మృతి


