హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేయూత పింఛన్ల దరఖాస్తులకు నేడే ఆఖరు

ASF: చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు సోమవారంతో ముగియనుంది. నాలుగేళ్ల తర్వాత ప్రభుత్వం కొత్త పింఛన్లకు దరఖాస్తులు ఆహ్వానించడంతో ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా అర్హులు దరఖాస్తు చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. అత్యధికంగా వితంతువులు 4,682 మంది, ఒంటరి మహిళలు 264, దివ్యాంగులు 1,415, చేనేత కార్మికులు 38, గీత కార్మికులు 55 మంది దరఖాస్తు చేసుకున్నారు.