HYD: శ్రీ వాగ్దేవి సంస్థ ఆధ్వర్యంలో త్యాగరాజ గానసభలో 'స్వర సప్త సంగీత వాద్య నృత్య సమ్మేళనం' నిన్న రాత్రి చిక్కడపల్లిలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథి బేరి రామచందర్ యాదవ్ హాజరై కళాకారులకు 'నాట్య రాయలి', గురువులకు 'నాట్య శిరోమణి' పురస్కారాలు అందించారు. కళలను ప్రోత్సహిస్తున్న నిర్వాహకులు బి.నాగేంద్ర యాదవ్, బి.దివ్యలక్ష్మిలను ఆయన అభినందించారు.
తెలంగాణ
వైభవంగా స్వర సప్త సంగీత వాద్య నృత్య సమ్మేళనం


