హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

ATP: ఎన్టీఆర్ భరోసా పింఛన్లను సెప్టెంబర్ 1న ఉదయం 7 గంటల నుంచి పంపిణీ చేయనున్నట్లు డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శైలజ తెలిపారు. జిల్లాలోని 2,76,238 మంది లబ్ధిదారులకు రూ.123.686 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు. మంగళవారం ఉదయం ఇంటి వద్దకే వచ్చి పింఛన్ అందజేస్తారని చెప్పారు. మొదటి రోజు తీసుకోని వారికి 2వ తేదీన సచివాలయాల వద్ద ఇస్తారని సూచించారు.