హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ సరఫరాకు అంతరాయం

HNK: జిల్లాలో విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా సోమవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని టౌన్ డీఈ సాంబరెడ్డి తెలిపారు. ఈ మేరకు శాయంపేట ఉపకేంద్రం పరిధిలోని నాగేంద్రనగర్, ప్రకాశ్‌రెడ్డిపేట, లోటస్ కాలనీ, మైత్రీవనం విల్లా ప్రాంతాల్లో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు. కావున వినియోగదారులు సహకరించాలని కోరారు.